Allu Aravind: మెగా కుటుంబం తో గొడవలపై రియాక్ట్ అయిన అల్లు అరవింద్

Allu Aravind: మెగాస్టార్ తో తన రిలేషన్ గురించి మాట్లాడిన అల్లు అరవింద్

Jyothi
Updated on: 12 Oct 2022 8:00 AM IST
Allu Aravind Reacts to the quarrels With the Mega Family
X

Allu Aravind: మెగా కుటుంబం తో గొడవలపై రియాక్ట్ అయిన అల్లు అరవింద్

Allu Arvind: ఎంతో కాలం గా మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అరవింద్ కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారి మధ్య సఖ్యత ఏమాత్రం కుదరటం లేదు అని ఒక రేంజిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై భారీ ఎత్తున రూమర్లు కూడా వచ్చాయి. కానీ ఇరు కుటుంబాల నుంచి దీనికి సంబంధించిన క్లారిటీ కూడా రాకపోవడంతో వాటిల్లో ఎంతో కొంత నిజం ఉంది అని ప్రేక్షకులు అనుకోవడం మొదలు పెట్టారు. అయితే తాజాగా ఈ రూమర్స్ గురించి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అలీ హోస్ట్ చేసిన "అలితో సరదాగా" అనే చాట్ షోకి హాజరయిన అరవింద్‌ చిరంజీవితో తన బంధం గురించి మాట్లాడారు. "మన సమాజంలో ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణం. మేము (అల్లు అరవింద్, చిరంజీవి) 1980ల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఇండస్ట్రీలో కలిసి పెరిగాం," అని అన్నారు అల్లు అరవింద్.

"మా పిల్లలు కూడా అదే పరిశ్రమలో పనిచేస్తున్నారు. వారంతా ఒకే రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి కచ్చితంగా వారి మధ్య పోటీ ఉంటుంది. అందరూ పోటీ పడుతూ తమదైన గుర్తింపు తెచ్చుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మా మధ్య గొడవలు ఉన్నాయని ప్రజలు అనుకోవచ్చు. కానీ మేమంతా ఒక కుటుంబానికి చెందిన సభ్యులమని, ఎప్పుడూ ఒకే పైకప్పు కింద ఉంటామని వారు తెలుసుకోవాలి. మేమంతా చిరంజీవి ఇంట్లోనే దీపావళి, సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాము. ప్రతీ సారి మేము కలిసి ఉన్నామని నిరూపించడానికి మా వేడుక వీడియోలను మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు కదా" అని ఈ పుకార్లకు రిప్లై ఇచ్చారు అల్లు అరవింద్.

Jyothi

Jyothi

Next Story