'ఆహా'లో బ్ర‌హ్మానందం షో..?!

Brahmanandam: అన్నీ అనుకున్నట్లు జరిగితే షో అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతోంది అని సమాచారం

R Tripura Malini
Published on: 2 Nov 2022 2:31 PM IST
allu aravind is planning another talk show with brahmanandam
X

బ్రహ్మానందంతో మరొకటాక్ షో ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్

Brahmanandam: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటు సినిమాలతో మాత్రమే కాకుండా అటు వెబ్ సిరీస్ తో కూడా బాగానే ముందుకు దూసుకు వెళుతున్నారు. నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో మంచి సినిమాలను అందించిన కూడా అల్లు అరవింద్ ఓటీటీ లోని వెబ్ సిరీస్ లతో కూడా మంచి హిట్ అందుకున్నారు. అసలు ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణను అన్ స్టాపబుల్ అనే షోకి హోస్ట్ గా మార్చేసింది అల్లు అరవింద్.

ఇక సీజన్ వన్ సూపర్ హిట్ అయిపోవడంతో ఇప్పుడు రెండవ సీజన్ ని కూడా మొదలు పెట్టేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం బ్రహ్మానందం హోస్ట్ గా ఇప్పుడు అల్లు అరవింద్ మరొక టాక్ షోని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా ఇటు సెలబ్రిటీ టాక్ షోలను కూడా అల్లు అరవింద్ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందంతో ఒక షో చేస్తే బాగుంటుందని అనుకున్న అల్లు అరవింద్ స్వయంగా బ్రహ్మానందం ను కలవడానికి వెళ్లారు.

ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే షో అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతోంది అని సమాచారం. దీనికోసం అల్లు అరవింద్ ముంబై నుంచి ఒక ప్రత్యేకమైన టీం ని కూడా రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బ్రహ్మానందం అనిల్ రావిపూడి తో కలిసి ఒక షోని మొదలుపెట్టారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story