అక్కినేని హీరోలకి ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వని 2022

Akkinenis Heroes Have Not Hit a Single Film This Year
x

అక్కినేని హీరోలకి ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వని 2022

Highlights

అక్కినేని హీరోలకి ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వని 2022

Akkineni Heroes: మిగతా హీరోల సంగతి పక్కన పెడితే అక్కినేని హీరోలకి మాత్రం 2022 పెద్దగా అచ్చి రాలేదని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో అక్కినేని కుటుంబం నుంచి మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఒకటి కూడా చెప్పుకోతగ్గ హిట్ అవ్వకపోవడం అభిమానులను ఆందోళన చెందేలా చేస్తోంది. ఈ సంవత్సరం మొదట్లో నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటించిన "బంగార్రాజు" సినిమా భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదలైంది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో "సోగ్గాడే చిన్నినాయన" వంటి హిట్ సినిమాకి సీక్వెల్ గా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైన మిగతా సినిమాలతో పోలిస్తే బాగానే అనిపించినప్పటికీ కలెక్షన్లు మాత్రం కేవలం యావరేజ్ గా మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు.ఆ తర్వాత నాగచైతన్య హీరోగా "థాంక్యూ" అనే సినిమా విడుదలైంది. పరశురామ్ దర్శకత్వంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కేవలం ఐదు కోట్లను మాత్రమే థియేటర్లలో వసూళ్లు చేయగలిగింది.

నిజానికి టైర్ టు హీరోలలో ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్ల కంటే ఇది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అలా "థాంక్యూ" సినిమా నాగచైతన్య కరియర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ మధ్యనే అక్టోబర్ 5న నాగార్జున హీరోగా నటించిన "ది ఘోస్ట్" సినిమా విడుదలైంది. స్పై త్రిల్లర్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ఐదు కోట్ల కంటే తక్కువ కలెక్షన్లను నమోదు చేసుకోగలిగింది. దీంతో ఈ సంవత్సరం అక్కినేని హీరోలకి ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories