చిరుకి జోడీగా ఐష్!

చిరుకి జోడీగా ఐష్!
x
Highlights

సైరా సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తన 152 వ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ...

సైరా సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తన 152 వ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ను ఎంపిక చేసుకున్నట్టు టాలీవుడ్ టాక్. గతంలో ఈ సినిమాకి నయనతార హీరోయిన్ అని ప్రచారం జరిగింది. అయితే, సినిమాలో చిరు పక్కన ఎప్పుడు చూడని నటిని ఎంపిక చేసుకుంటే ఫ్రెష్ లుక్ వస్తుందని భావిస్తున్నారట. పైగా సైరాలో నయనతార చేస్తుండడం తో వరుసగా రెండో సినిమాలో కూడా నయనే ఉంటే వెరైటీ ఉండదని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఐష్ సినిమాలో నటిస్తున్న వార్త అధికారికంగా వెల్లడించ నున్నారని చెబుతున్నారు.

కాగా, సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ సెట్‌ని తీర్చుదిద్దుతున్నారు. అక్కడే తొలి షెడ్యూల్‌ త్వరలో మొదలు కానుంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories