Top
logo

'సైరా' కు అక్కడ ఇబ్బందులు తప్పవా?

X
Highlights

మెగాస్టార్ మనసుపడి చేసిన భారీ సినిమా సైరా. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. నిన్ననే విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది.

మెగాస్టార్ మనసుపడి చేసిన భారీ సినిమా సైరా. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. నిన్ననే విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. అందులో చిరంజీవిని చూసిన అభిమానులు పొంగి పోతున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

అప్పుడెప్పుడో హిందీలో మెరిసిన చిరంజీవి చాలా కాలం తరువాత మళ్లీ బాలీవుడ్ తెరపై హంగామా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎక్సెల్‌ ఎంటర్టెన్మెంట్స్‌ , ఫర్హాన్‌ అక్తర్‌ కలిసి ఈ సినిమా హిందీ డబ్బంగ్‌ హక్కులను భారీ రేట్‌ కు కొనుగోలు చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా విషయంలో వారికి ఒక పెద్ద చిక్కే వచ్చి పడిందంటున్నారు. అదే రోజున సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, సెన్సేషనల్‌ స్టార్‌ టైగర్‌ ప్రాఫ్‌ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ 'వార్‌' కూడా సైరా విడుదల రోజైన అక్టోబర్‌ 2నే రిలీజ్‌ కానుంది. ఇప్పటికే బాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్‌ మరియు టైగర్‌ ఫ్యాన్స్‌ లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లు సినిమాను కూడా అత్యధిక థియేటర్స్‌ లో రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజున సైరా

కూడా రిలీజ్‌ కానుండడంతో ఒకరకంగా కొంతవరకు రెండిటికీ థియేటర్స్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

థియేటర్ల సమస్యను ఎదో ఒక రకంగా పరిష్కరించుకున్నా, వార్ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ హీరోలు ఉండడం.. ఇద్దరు హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉండడంతో సైరా ఓపెనింగ్ లకు ఇబ్బంది తలెత్తవచ్చని అక్కడి సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వార్ సినిమా జోనర్ కి సైరా జోనర్ కీ సంబంధం లేకపోయినా.. బాలీవుడ్ హీరోలుగా వారికి ఉన్న ముద్ర ప్రేక్షకులను అటువేపే ఆకర్షించే అవకాశం ఉందనేది ఆ వర్గాలు వేస్తున్న అంచనా. దీంతో సైరా సినిమా విషయంలో జాగ్రత్తగా బిజినెస్ ప్లాన్ చేయాలని, ప్రచారాన్ని కూడా గట్టిగా చేయాలనీ ఎక్సెల్ ఎంటర్టెన్మెంట్స్‌ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య వార్ లో ఎవరు సై అని విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.


Next Story