హీల్స్ వేసుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఈ టిప్స్ పాటించండి..

హీల్స్ వేసుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఈ టిప్స్ పాటించండి..
x
Highlights

అమ్మాయిలంటే చాలు వాళ్లని అలంకార ప్రియులని అంటుంటారు. మార్కెట్లోకి కొత్తగా ఏ మోడల్లో దుస్తులు వచ్చినా వాటిని ఖచ్చితంగా తీసుకుని ట్రైచేయాలనుకుంటారు.

అమ్మాయిలంటే చాలు వాళ్లని అలంకార ప్రియులని అంటుంటారు. మార్కెట్లోకి కొత్తగా ఏ మోడల్లో దుస్తులు వచ్చినా వాటిని ఖచ్చితంగా తీసుకుని ట్రైచేయాలనుకుంటారు. అంతే కాదు ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే కలర్లో లిప్ స్టిక్, నేల్ పాలిష్, చెప్పులు ఇలా అన్ని మ్యాచింగ్ చూసుకుంటారు.

ఇక దుస్తుల తరువాత ఎక్కువగా ఇష్టపడేదంటే చెప్పులు అనే చెప్పుకోవాలి. అందులోనూ ఫ్లాట్ కాకుండా, ఎత్తు చెప్పులకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులోనూ ఎక్కువగా పెన్సిల్ కట్ చెప్పులను ఫ్యాషన్ షోలో పార్టీల్లో ధరిస్తుంటారు. ఇక అవి ఎంత ఫాషనబుల్ గా ఉంటాయో, వీటిని మెయింటెయిన్ చేయడం అంత కష్టంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఈ హిల్స్ వేసుకునే ప్రతి సారి కొన్ని సమస్యలు ఎప్పుడూ ఎదుర్కొంటూ ఉంటారు.

కానీ ఈ సమస్యలను కూడా అధిగమించడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ ని మహిళలు పాటిస్తే చాలు ఎంతో ఇష్టపడే అందమైన హిల్స్ ని పాదాలకు ధరించి ఎంతో అందంగా కనిపించండి. ఇక ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎత్తు చెప్పులు ధరించడంలో తీసుకునే జాగ్రత్తలు..

మీరు ఏదైనా కొత్త జత చెప్పులను తీసుకున్నప్పుడు ముందుగా కాళ్లకు సాక్స్‌ ధరించి కొత్త చెప్పులు వేసుకుని ఖాలీ ప్రదేశాల్లో నడవండి. అలా చేస్తే మీరు ఆ కొత్త చెప్పులకు అలవాటు పడుతారు. దీంతో ఆ చెప్పులను ధరించడం సులభంగా మారుతుంది. దీంతో కాళ్ల వేళ్లకు బొబ్బలు రాకుండా వేళ్లు సురక్షితంగా ఉంటాయి.

యాంటీ బ్లిస్టర్ స్టిక్ వాడాలి..

ఈ యాంటి బ్లిస్టర్ స్టిక్ ని కొత్త చెప్పులు ధరించే ముందు అవసరమయిన భాగాల్లో అప్లై చేయాలి. దీంతో పాదాలకు బొబ్బలు ఏర్పడిన ప్రాంతంలో సమస్య లేకుండా చూస్తుంది. దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనే చెప్పుకోవాలి.

ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి..

కొత్తగా తీసుకునే షూస్, చెప్పులు, బట్టలు వంటివి, వేర్వేరు బ్రాండ్లు, వేర్వేరు సైజ్‌ల్లో మార్కెట్లో లభిస్తాయి. అందుకే వేరే వేరే బ్రాండ్లలో కొనుగోలు చేసేటప్పుడు మీ అడుగుల పరిమాణాన్ని ఖచ్చితంగా కొలుచుకోవాలి. ఒక నిర్దిష్ట బ్రాండ్‌లో వాటి సైజ్ ఆరు అయితే, వేరే బ్రాండ్స్ లో ఆ సైజ్ వేరేదిగా ఉండొచ్చు. అందుకే తీసుకునే వారు సరైన సైజ్‌లో తీసుకోకపోతే చాలానే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబాట్టి జాగ్రత్తలు వహించాలి.

చంకీ హీల్స్ తీసుకోండి..

చాలా మంది పెన్సిల్ హీల్స్ ని ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. కానీ వాటిని క్యారీ చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వారు చంకీ లేదా బ్లాక్ హీల్స్ ట్రై చేయండి. అవి కొంచం విశాలంగా ఉంటాయి దీంతో అవి మీ బరువును సమానంగా హీల్స్ మీద విస్తరిస్తాయి. దీంతో క్రమంగా మీ పాదాలపై ఒత్తిడి తగ్గిస్తుంది దీంతో ఇష్టమైన చెప్పులు ధరించి ఎంజాయ్ చేయొచ్చు.

బకిల్స్, స్ట్రాప్స్‌ గట్టిగా ఉండేవి ఎంచుకోవాలి..

బకిల్స్, స్ట్రాప్స్ ఉండేలా హీల్స్ తీసుకోవడానికి మొగ్గు చూపండి. ఇవి మీ పాదాలకు బొబ్బలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లు, చికాకును కూడా తగ్గిస్తాయి. దీంతో క్రమంగా హీల్స్ ని వాడడం మీకు సులువుగా మారుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories