logo

బంపర్ ఆఫర్ : రూ. 2799లకే రెడ్‌మి నోట్‌ 6ప్రొ..

బంపర్ ఆఫర్ : రూ. 2799లకే రెడ్‌మి నోట్‌ 6ప్రొ..
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమి మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.13,999 ధరతో మార్కెట్లో...

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమి మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.13,999 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్న షావోమి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ను కేవలం ధర రూ.2799 లకే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ను షో రూమ్ లో కాకుండా ఫ్లిప్‌కార్ట్‌ లోనే కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది.ఈ మేరకు ఎంఐ ఇండియా ట్విటర్‌లో ట్వీట్ చేసింది. అయితే ఈ ఫోన్ ను పరిమితకాల ఆఫర్‌గా అందిస్తున్నట్టు షావోమి వెల్లడిస్తోంది. అలాగే కొన్ని కండిషన్స్ కూడా జతజేసినట్టు తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ లో మాత్రం రెడ్‌మి నోట్‌ 6 ప్రొ నే కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే హై5 పేరుతో తన స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్న షావోమి తాజాగా రెడ్‌మి 6పై భారీ తగ్గింపు ప్రకటించి వినియోగదారులను ఆకర్షించింది.

లైవ్ టీవి

Share it
Top