టేస్టీ పన్నీర్ టిక్కా రోల్‌ తయారీ ఎలా?

టేస్టీ పన్నీర్ టిక్కా రోల్‌ తయారీ ఎలా?
x
Highlights

పన్నీర్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. పన్నీర్ తో తయారు చేసిన ఏ వంటకాన్నైనా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు.

పన్నీర్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. పన్నీర్ తో తయారు చేసిన ఏ వంటకాన్నైనా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు. ఇది కేవలం రుచికరమైన ఆహారమే కాదు.. ప్రోటీన్‌లు అధిక శాతం ఉన్నాయి.. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్నీర్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. పన్నీర్ లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.. అందుకే అజీర్తి, కడుపు ఉబ్బరం, వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్‌కి అవసరమమయ్యే పోషకాలు పన్నీర్ లో పుష్కలంగా లభిస్తాయి..అందుకే ఆ పన్నీర్ తో అందరూ ఇష్టపడే ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినే పన్నీర్ టిక్కా రోల్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా..

కావాల్సిన పదార్ధాలు:

పన్నీర్

♦ మైదా పిండి

♦ పెరుగు

♦ పొడి పిండి

♦ నూనె

♦ కోడిగుడ్లు

♦ ఉల్లిపాయలు

♦ పచ్చిమిర్చి

♦ నిమ్మరసం

♦ ఉప్పు

తయారీ విధానం:

మన రెసిపీ పన్నీర్ టిక్కా రోల్ కాబట్టి రోల్స్ చేసుకునేందుకు ముదుగా మైదా పిండిని తీసుకోవాలి...రోల్స్ కోసం మైదా పిండిని వినియోగిస్తున్నాను. కావాలనుకునే వారు గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి... ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు పిండిని పక్కనపెట్టుకోవాలి. ఇలా చేడం వల్ల రోల్స్ చాలా స్మూత్ గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనెవేసుకోవాలి.. నూనె కాస్త కాగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి.

వీటి రెండింటిని బాగా వేగించాలి. కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం తీసుకుని అందులో వేసి ఆగా కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వీటిని కాస్త మెళ్లిగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ముక్కలను ఉడికించాలి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి చపాతీలను కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తరువత చపాతీపై తిప్పి కోడిగుడ్డు కొట్టి పోయాలి. ఇప్పుడు చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలను మధ్యలో పెట్టి చపాతీలతో రోల్ చేయాలి, వేడి వేడిగా తీసుకుంటే దని రుచే వేరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories