Top
logo

మీ ఒంట్లో ఐరన్ ఉందా...? మహిళలు తస్మాత్ జాగ్రత్త

మీ ఒంట్లో ఐరన్ ఉందా...? మహిళలు తస్మాత్ జాగ్రత్త
X
Highlights

మన శరీరంలో ఐరన్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి 12 పరిమాణం తగ్గితే అంతరిలో రక్త హీనత ఏర్పడుతుంది. ఈ సమస్యతో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. సాధారణంగా శరీరంలో 12 శాతం హిమోగ్లోబిన్‌ ఉండాలి.

మన శరీరంలో ఐరన్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి 12 పరిమాణం తగ్గితే అంతరిలో రక్త హీనత ఏర్పడుతుంది. ఈ సమస్యతో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. సాధారణంగా శరీరంలో 12 శాతం హిమోగ్లోబిన్‌ ఉండాలి..కానీ చాలా మంది మహిళల్లో ఆస్థాయిలో ఒక్కొక్కరికి 6 శాతానికి 5 శాతానికి పడిపోయిన మహిళలు ఉన్నారు. రక్తహీనత సమస్య వల్ల మహిళలకు సైడ్‌ఎఫెక్ట్స్ ఏర్పడతాయి..శరీరంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం వల్ల ఆ స్థానాన్ని నీరు ఆక్రమిస్తుంది.. దాని వల్ల శరీరం బరువెక్కుతుంది. ప్రధానంగా కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం , కుర్చున్నా.. నిలుచున్నా.. శరీరం సహకరించకపోవడం వంటివి ఉంటాయి. ఇవి మహిళలను చాలా ఇబ్బంది పెడతాయి..

చాలా మంది మహిళలు ఒంట్లో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు స్థానికంగా ఉన్న వైద్యుడిని సంప్రదించి ఐరన్ మాత్రను వేసుకుంటుంటారు.. కానీ అది తాత్కాలికమే..దీర్ఘకాల ప్రయోజనాలు పొందాలంటే మహిళలు పలు జాగ్రత్తులు తీసుకోవాలి. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్ధాల్లో ఐరన్ శాతాన్ని పెంచే వాటిని తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మహిళలే ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఎందుకంటే పీరియడ్స్ వల్ల ఎక్కువగా రక్తం పోతుంది. అలాగే డెలివరీ సమయంలో కూడా చాలా వరకు రక్తాన్ని పోగొట్టుకుంటారు. అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త కనబరచాలి.

గోదుమలు, బాదాంపప్పులు, జీడిపప్పులు, పుచ్చ, వంటి పండ్లను సజ్జలు, నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు , రాజ్మా బీన్స్, అవిసె గింజలు వంటి పప్పు ధాన్యాలను , ఆకుకూరలైన పాలకూర , తోటకూర, మెంతికూర అదేవిధంగా కాలీఫ్లవర్, కొబ్బరి చెక్క వంటివి తరుచుగా తీసుకుంటూ ఉండాలి.

మనం తినే ఆహారంలో ఐరన్ గ్రమించాలంటే..మన శరీరానికి విటమిన్ సి అవసరం ఉంటుంది. సి విటమిన్ వండిన ఆహారంలో లభించదు అందుకని.. ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. జామ, బత్తాయి, బొప్పాయి, కవీ, నారింజ వంటి రసాలు తరుచుగా తీసుకుంటూ ఉండాలి. కూరగాయలైన క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, టమాట, బీట్‌రూట్, వంటివి తీసుకోవాలి.. అంజీర్ పండ్లను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

Web TitleHealth tips for women in Telugu
Next Story