పుచ్చకాయతో ఎంతో ఆరోగ్యం..

పుచ్చకాయతో ఎంతో ఆరోగ్యం..
x
Water Melon
Highlights

పుచ్చకాయ దీన్నే కర్బూజా, వాటర్ మిలన్ అని కూడా అంటారు. కేవలం వేసవి కాలంలో వచ్చే ఈ కాయలు ఇప్పుడు అన్ని కాలాల్లోనూ వస్తున్నాయి.

పుచ్చకాయ దీన్నే కర్బూజా, వాటర్ మిలన్ అని కూడా అంటారు. కేవలం వేసవి కాలంలో వచ్చే ఈ కాయలు ఇప్పుడు అన్ని కాలాల్లోనూ వస్తున్నాయి. ఈ కాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండలకు బయటికి వెల్లే వారు ఈ కాయను తింటే వడదెబ్బనుంచి కాపాడుతుంది. మనిషి శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఇది తినడం ద్వారా శరీరానికి కావలసిన నీటి శాతాన్ని అందించి డీ హైడ్రేషన్ ను కూడా తగ్గిస్తుంది. అసలు ఈ పుచ్చకాయ పంట ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ ప్రస్తుతం దీన్ని భారత దేశంలో ఒక ఉద్యాన పంటగా సాగుచేస్తున్నారు. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది.

పుచ్చకాయలో పోషకాలు..

ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ-విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సీ, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్లకన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి.

పుచ్చకాయ తినడం వలన కలిగే లాభాలు..

కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు కర్బూజా పండు. ఇది తన క్షారగుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాల్నీ వ్యర్థపదార్థాల్నీ తగ్గిస్తుంది.

♦ శరీరంలో కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్లనొప్పుల్నీ వాతరోగాన్నీ నియంత్రిస్తుంది.

♦ మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ తగ్గిస్తుంది.

♦ ఎన్నోరకాల ఖనిజలవణాలున్న కర్బూజా పండును బాలింతలకు తినిపిస్తే బాగా పాలు పడతాయి.

♦ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది.

♦ రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు కలుగుతుంది.

ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్‌ వాటర్‌ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండి ఈ కర్బూజలో అనేక లాభాలు ఉన్నాయి . టొమాతో ల మాదిరిగా దీనిలో లైకోఫిన్‌ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories