మందు తాగితే లావు అవుతారా..?

మందు తాగితే లావు అవుతారా..?
x
Highlights

ఈ కాలంలో మందు, చిందు సర్వసాధారణం అయిపోయాయి. మన దగ్గరైతే ఏ కార్యం చేసిన కానీ మందు అనేది తప్పని సరి కదా! ఇదిలా ఉంటే మరోవైపు మద్యసేవించడం ఆరోగ్యానికి హానికరం అని చాలా యాడ్స్ వస్తున్నే ఉంటాయి.

ఈ కాలంలో మందు, చిందు సర్వసాధారణం అయిపోయాయి. మన దగ్గరైతే ఏ కార్యం చేసిన కానీ మందు అనేది తప్పని సరి కదా! ఇదిలా ఉంటే మరోవైపు మద్యసేవించడం ఆరోగ్యానికి హానికరం అని చాలా యాడ్స్ వస్తున్నే ఉంటాయి. అయినా కానీ మద్యం సేవించడం మాత్రం మానివేయారు. అయితే మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకమో వైద్యులు చెబుతుంటారు. అయితే అయితే మద్యం సేవించే వారిలో కొందరు అనూహ్యంగా లావెక్కిపోతారని తాజాగా లండన్ పరిశోధకులు తేల్చారు. మందు సేవించుటప్పుడు మందులోని కాలరీలతోపాటు అధికంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల అధికంగా కాలరీలు మన శరీరంలోకి చేరి కొవ్వుగా మారి లావు అవుతారట.

అయితే మద్యం ఎప్పుడైతే మన శరీరంలోకి ప్రవేశించగానే దాన్ని ఒక విషపదార్థంగా చూసి కాలేయం నిర్వీర్యం చేసే పనిలో పడుతుంది. ఇక దాంతో పాటు వచ్చే ఆహారాన్ని కాలేయం వదిలేస్తుంది. దీంతో మన శరీరంలో ఆహారం తాలూకా కాలరీలు కొవ్వు రూపంలో స్థిరపడిపోతాయి. ఇక మద్యం నుంచి విడగొట్టిన కొవ్వు కూడా ఆల్డ్ 1 ఏ1 అనే ఎంజైమ్‌గా మారి కొవ్వుగా తయారవుతుందట. మద్యం తీసుకునేటప్పుడు అతిగా తినే ఆహారం మొత్తం కొవ్వుగా మారి.. మద్యంలోని కొవ్వు జతచేసి తొందరగా లావు ఎక్కుతారని లండన్ పరిశోధకులు తేల్చారు. కాగా, రక్తంలో మద్యం ఎక్కువైతే గ్లూకోజ్‌ను నియంత్రించే మన శరీరంలోని గ్లూకోగాన్ హార్మోన్ పనిచేయక షుగర్ వ్యాధి కూడా అతి తొందరగా రావడానికి ఛాన్స్ ఉందని పరిశోధకులు తేల్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories