వైసీపీలో మళ్లీ ఆయన హవా కొనసాగిస్తారా ?

వైసీపీలో మళ్లీ ఆయన హవా కొనసాగిస్తారా ?
x
Highlights

ఏపీలో కాంగ్రెస్ గూటి నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కొంత మంది నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్గి వెంటే ఉంటూ...

ఏపీలో కాంగ్రెస్ గూటి నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కొంత మంది నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్గి వెంటే ఉంటూ అండదండగా నిలిచారు. నేటికి వారు ఇంకోపార్టీ వైపు కన్నేత్తి కూడా చూడకుండా జగన్ అడుగు జాడలోనే ఉన్నారు. అలాంటీ వారిలోనే ఒకరు ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఇక జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి. గత ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఇక వైసీపీ పార్టీలో వైవీ సుబ్బారెడ్డి నంబర్ 2 అనే వార్తలు కూడా గతంలో జోరుగానే వినిపించాయి. ఇదిలా ఉంటే ఎన్నికలకు కొద్దివారాల ముందు జరిగిన పరిణామాలతో వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటనే దానిపై వైవీ సుబ్బారెడ్డి అనుచరుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీలోకి రావడంపై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతోనే వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి ప్రాధాన్యత దిగజారిపోయిందని అప్పట్లో జోరుగా వార్తలు గుప్పుమన్నాయి.

కాగా రెండోసారి వైవీకి ఒంగోలు ఎంపీ సీటు జగన్ నిరాకరించిన కానీ వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఏదో పదవిపై హామీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదనేది వైవీ వర్గీయల మాట. కాగా ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీ అధికార పగ్గాలు చేపడితే బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ చేసిన ప్రకటన వైవీ సుబ్బారెడ్డికి ఏ మాత్రం కూడా మింగుడుపడలేదనే వాదన ఉంది. ఇక ఎన్నికల ముగిసిన దగ్గరి నుండి వైవీ సుబ్బారెడ్డి లోటస్ పాండ్‌కు సైతం దూరం దూరంగానే ఉంటూ వస్తున్నారని వైసీపీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే గతంలో పార్టీకోసమే శ్రమించిన వైవీకి చింతఇకు అంతా కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏమిటని వైవీ సుబ్బారెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. అయితే మళ్లీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే మాత్రం వైవీ సుబ్బారెడ్డి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని వైవీ పలువురితో అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ పార్టీలో తలుక్కుమని మెరిసిన వైవీ తిరిగి మ‎ళ్లీ వైసీపీలో తన హవా కొనసాగిస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories