Top
logo

టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. నేను..

టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. నేను..
X
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తనకు సీటు కేటాయించినా, కేటాయించకపోయినా కానీ...

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తనకు సీటు కేటాయించినా, కేటాయించకపోయినా కానీ తాను మాత్రం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఒక సైనికుడినేని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. బుధవారం రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన సీటు విషయంలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. కాగా ఒక కేసు విషయంలో సాక్ష్యాధారాలు సేకరిచండానికి నాలుగు రోజులుగా తాను అజ్ఞాతం‌లో ఉన్నానని అప్పటికే ఈలోగా తన అనుచరులు హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్‌కు వచ్చి గొడవ చేశారన్న విషయం తనకు తెలియదన్నారు. కౌన్సిలర్ల రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.

Next Story