ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు..తండ్రిలాగే కొడుకు హత్య

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు..తండ్రిలాగే కొడుకు హత్య
x
Highlights

వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ హత్యతో కడప జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ హత్య ఏపీ...

వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ హత్యతో కడప జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ హత్య ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలకు దారితీస్తోంది. గత కొంత కాలంగా హత్యారాజకీయాలు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ తగ్గడంతో ప్రశాంతంగా ఉన్న కడప జిల్లా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో మరోసారి ఉలిక్కిపడింది. కడప జిల్లా పులివెందులలోని తన ఇంటిలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. మొదట సాధారణ మృతేనని అందరూ భావించినా.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని విచారణలో తేలింది. హత్యకు గల కారణాల సంగతి ఎలా ఉన్నా హత్య జరిగిందనే విషయం స్థానికంగానూ, రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, వివేకానంద హత్య.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలకు దారితీస్తోంది. వైఎస్ వివేకానంద తరహాలో ఆయన తండ్రి కూడా హత్యకు గురయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యర్థులు ఆయన్ను దాడి చేసి, హతమార్చారు. అప్పట్లో ఈ ఘటన ఏపీలో సంచలనమైంది. 1998 మే 23న రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇడుపులపాలయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు తన అనుచరుతలతో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి ఆయన్ను హత్య చేశారు.రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి అప్పటి ఉమ్మడి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. దోషులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ ఏడాది టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. వీరిలో సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తిపై వైఎస్ వివేకా కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories