లగడపాటి సర్వేపై జగన్ ఎమన్నారంటే..

లగడపాటి సర్వేపై జగన్ ఎమన్నారంటే..
x
Highlights

కాకినాడ వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు . కాకినాడలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో డప్పు మోగించి ఎన్నికల...

కాకినాడ వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు . కాకినాడలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో డప్పు మోగించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లగడపాటి సర్వే, చంద్రబాబులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొద్ది రోజుల్లోనే లగడపాటి లాంటి దొంగ సర్వేలు వస్తాయని జగన్ విమర్శించారు. ఇటివల పక్క రాష్ట్రమైన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్ర అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ గారి సర్వే ఎమైందో అందరికీ తెలుసని గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారంటూ ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తూ మార్పు కోసం పాటు పడాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల డేటా చోరీలో దొరికిన చంద్రబాబు పార్టీని బహిష్కరించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories