నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్

X
Highlights
వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్లు, నాయకుల బృందం నేటి సాయంత్రం గవర్నర్...
Chandram15 March 2019 6:09 PM GMT
వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్లు, నాయకుల బృందం నేటి సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలవనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో సహా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, ఏపీలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లనుంది. టీడీపీ హత్యా రాజకీయాలకు నిరసనగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలకు వైసీపీ పిలుపునిచ్చి్ంది. నల్ల చొక్కాలు, నల్ల రిబ్బన్లు, బ్యాడ్జీలు, జెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది.
Next Story