మహాకూటమికి మా పార్టీ దూరం!

మహాకూటమికి మా పార్టీ దూరం!
x
Highlights

బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహాకూటమిలో తమ పార్టీ చేరడంలేదని బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహాకూటమిలో తమ పార్టీ చేరడంలేదని బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. అదే విధంగా ఇటు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు తమ పార్టీ దూరంగానే ఉంటుందని పట్నాయక్ తెలిపారు. అయితే మంగళవారం ఇదే అంశంపై ఒడిశా సీఎం పట్నాయక్ స్పందించగా కూటమిలో చేరది చేరకపోవడం అనేది ఇంకా తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పిన మరుసటి రోజే బుధవారం కూటమిలో ఉండేదే లేదని స్ఫష్టం చేయడంతో అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే నేడు ఏర్నాటుచేసిన బీజేడీ సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్నివెల్లడించారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని బీజేపీ పార్టీని ఎన్నోసార్లు డిమాండ్ చేస్తున్నా బీజేపీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదని నవీన్ పట్నాయక్ విమర్శించారు. కాగా 2014 ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీకి కేవలం ఒక్క స్థానంలోతోనే సరిపెట్టుకుందని మిగిలిన 20స్థానాలు బీజేడీ గెలుపొందిదని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోయిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories