ఉప్పల్‌లో పరుగుల సునామీ.. సన్‌రైజర్స్ భారీ స్కోరు

ఉప్పల్‌లో పరుగుల సునామీ.. సన్‌రైజర్స్ భారీ స్కోరు
x
Highlights

ఉప్పల్ స్టేడియాన్ని పరుగుల మోతతో ముంచెత్తింది. రాజస్థాన్‌తో 199 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్...

ఉప్పల్ స్టేడియాన్ని పరుగుల మోతతో ముంచెత్తింది. రాజస్థాన్‌తో 199 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 185 పరుగులు జోడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.

బెయిర్‌స్టో మొదటి నుంచీ బాగా ఆడాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ, 52 బంతుల్లో సెంచరీ చేశాడు. చివరికి కేవలం 56 బంతుల్లో 114 పరుగులు చేసి ఔటయ్యాడు.7 సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఇక వార్నర్ 55 బంతుల్లో వంద పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి. కేకేఆర్‌ తరఫున నమోదు చేసిన ఈ ఓపెనింగ్‌ భాగస‍్వామ్యమే ఇప్పటివరకూ అత్యధికం. దీన్ని తాజాగా వార‍్నర్‌-బెయిర్‌ స్టోలు బద్దలు కొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories