విజయసాయిరెడ్డి కంప్లైంట్!... బాబు డొంక కదిలినట్టేనా?

విజయసాయిరెడ్డి కంప్లైంట్!... బాబు డొంక కదిలినట్టేనా?
x
Highlights

ఏపీ తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల డేటా చోరికి గురైదంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు...

ఏపీ తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల డేటా చోరికి గురైదంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు అయ్యప్ప సోసైటీలోని పలు ఐటీ సంస్ధల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు లభించాయి. దీంతో పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు భారీగా ఐటీ సంస్ధల దగ్గరకు చేరుకున్నారు. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న వారిని తమకు అప్పగించాలని కోరారు. కేసు విచారణ సాగుతున్నందున అప్పగించలేమన్న తెలంగాణ పోలీసులు సర్వర్లు ఓపెన్ చేయాలంటూ కోరారు. పోలీసుల దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించిన అసలు గుట్టు రట్టు కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఐటీ సంస్ధల్లో తెలంగాణ పోలీసుల సోదాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి సేవలందిస్తున్న సంస్ధల్లో దాడులు నిర్వహించడం వెనక సీఎం కేసీఆర్ హస్తముందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్‌కు మేలు చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదంటూ హెచ్చరించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories