కొండెక్కిన కూరగాయల ధరలు.. దళారి వ్యవస్థతో నష్టపోతున్న రైతన్న

కొండెక్కిన కూరగాయల ధరలు.. దళారి వ్యవస్థతో నష్టపోతున్న రైతన్న
x
Highlights

సిరులు కురిపించాల్సిన కూరగాయలు రైతులకు చీకట్లను నింపుతున్నాయి. మార్కెట్లో ధరలు మండుతున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి...

సిరులు కురిపించాల్సిన కూరగాయలు రైతులకు చీకట్లను నింపుతున్నాయి. మార్కెట్లో ధరలు మండుతున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. రైతుకు నష్టం దళారికి లాభం అన్నట్టు మారింది కూరగాయల సాగు.

తెలంగాణలో కూరగాయల ధరలు మండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు వణుకుతున్నారు. టమాటాలు మొన్నటి వరకు కిలోకి 20 రూపాయలు మించలేదు. ఇప్పుడు ఏకంగా 60 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక బెండకాయ, బీరకాయ, వంకాయలు, పర్చిమిర్చి ధరలు కూడా కొండెక్కాయి. అయితే వీటిని పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్లో రైట్లను పెంచేస్తున్నారు దళారులు.

ఎంతో కష్టపడి పండించిన పంటకు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో రైతుల వద్ద ధరకు, మార్కెట్లో ధరకు అసలు పొంతన ఉండటం లేదు. మర్కెట్లో ఉన్న ధరతో పోలిస్తే రైతుకు కనీసం 10 శాతం కూడా ధర అందడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories