Top
logo

సులబ్‌ కాంప్లెక్స్‌లో డబ్బులపెట్టెను పడేసి..

సులబ్‌ కాంప్లెక్స్‌లో డబ్బులపెట్టెను పడేసి..
Highlights

వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో దర్యాప్తు...

వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వనస్థలిపురంలో వాహనం నుంచి ఎత్తుకెళ్లిన పెట్టెనుంచి దొంగలు డబ్బులు తీసుకుని దానిని మలక్‌పేటలో పడేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఖాళీ పెట్టెనుస్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లోకి పెట్టెను తీసుకెళ్లి, నగదును సంచిలోకి మార్చుకుని బయటకు వచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్ష సాక్షులు, కొందరు వ్యాపారులను పోలీసులు ప్రశ్నించి మరింత సమాచారం తెలుసుకున్నారు. ఆరేడుగురు వ్యక్తులు ఆ ప్రాంతాల్లో తచ్చాడినట్టు గుర్తించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉన్న నిందితుల కోసం తమిళనాడుతో పాటు 5రాష్ట్రాలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సేఫ్‌గార్డ్‌ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.


లైవ్ టీవి


Share it
Top