Top
logo

కారెక్కిన టీడీపీ కీలక నేతలు..

కారెక్కిన టీడీపీ కీలక నేతలు..
Highlights

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్...

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఎన్నికలు కొద్దిరోజులు సమయం ఉన్న నేపథ్యంలో 16 ఎంపీ సీట్లు ఎలాగైనా కైవసం చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గూటికి గుడ్ బై చెప్పి పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే కాగా తాజాగా హైదరాబాద్ టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు టీఆర్ఎస్‌లోకి చేరారు. మందాడి శ్రీనివాసరావును కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరావును తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కూన వెంకటేశ్ గౌడ్, మందాడి శ్రీనివాసరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చెయ్యాలని కేటీఆర్ కోరారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు.

Next Story

లైవ్ టీవి


Share it