Top
logo

వారణాసి కలెక్టరేట్‌ చేరుకున్న పసుపు రైతులు.. మరికాసెపట్లో

వారణాసి కలెక్టరేట్‌ చేరుకున్న పసుపు రైతులు.. మరికాసెపట్లో
X
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతులు నామినేషన్లు వేసేందుకు తరలి...

ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతులు నామినేషన్లు వేసేందుకు తరలి వెళ్లారు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌, తమిళనాడుకు చెందిన దాదాపు 54 మంది రైతులు నిజామాబాద్ నుంచి వారణాసికి బయలుదేరి వెళ్లారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోసం కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రైతులు తెలంగాణాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్నికల బరిలో నిలిచారు. సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వచ్చేందుకు ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిలోనూ నామినేషన్లు వేసేందుకు తరలి వెళ్లారు. నామినేషన్లు వేయకుండా బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయినా నామినేషన్లు వేసి తీరుతామంటున్నారు రైతులు. ప్రధాని మోడీపై పోటీ చేసేందుకు సిద్ధమైన ఆర్మూర్ రైతులు మరికాసెపట్లో రైతులు నామినేషన్లు వేయనున్నారు.

Next Story