Top
logo

ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే!

ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే!
Highlights

ఎన్నికల నగారా మోగింది. పార్టీల్లో హడవుడి మొదలైంది. ఇక ఎన్నికల సమరం ఎన్నో రోజులు లేదు కేవలం 30 అంటే 30 రోజులు ...

ఎన్నికల నగారా మోగింది. పార్టీల్లో హడవుడి మొదలైంది. ఇక ఎన్నికల సమరం ఎన్నో రోజులు లేదు కేవలం 30 అంటే 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపే ఎన్నికల ప్రచారం,అభ్యర్థుల ఖరారు వంటి తదితర అంశాలుంటాయి. కాగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ప్రధానపార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అమలాపురం నుంచి ఓన్‌జీసీ మాజీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డీఎంఆర్ శేఖర్, రాజమండ్రి నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బరిలో దిగుతున్నారు. అయితే శేఖర్ సోమవారం రోజే జనసేన పార్టీలో చేరిన వెంటనే అమలాపురం పార్లమెంట్ స్థానానికి జనసేన అధినేత పవన్ ఎంపిక చేశారు. ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story