logo

అందుకే పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్ చేస్తానంటున్న శ్రీ రెడ్డి..

అందుకే పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్ చేస్తానంటున్న శ్రీ రెడ్డి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, శ్రీరెడ్డి మధ్య రగడ జరుగుతూనే ఉంది. తాజా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేస్తుందో చెప్పింది శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ చేసే పనుల వల్ల ఆయన్ను తాను వ్యతిరేకిస్తానని శ్రీ రెడ్డి చెప్పారు. జనసేన పార్టీ అంటే ప్రజాగొంతు అని, అవినీతిని ప్రశ్నిస్తానని చేప్పుకొచ్చిన జనసేన అధినేత పవన్, తన సైనికులు, పార్టీ కార్యకర్తలకు మాత్రం పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని అన్నారు శ్రీరెడ్డి. కేవలం జనసేన పార్టీ కేవలం డబ్బు, పలుకుబడి ఉన్నావల్లకు మాత్రమే పల్లకి మోసే పార్టీగా అర్థమౌతుందన్నారు.

జనసేన పార్టీలో అందరి చదువుకున్నా వారు ఉన్నారు అని చెబుతున్నారు ఆ పార్టీ శ్రేణులు కానీ మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. చదువురాని పవన్ కళ్యాణ్ వద్ద ఐఏఎస్‌లు పనిచేయాలా? అని ప్రశ్నించారు. ఇక ఎన్నికలు రాగానే హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయటం బోల్తపడుతుంటారని అన్నారు. ఎంతో అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే హామీలను నేరవేర్చలేకపోతున్నారు ఇక జనసేన పార్టీ చేస్తుందని నమ్మకం ఏంటి అని ప్రశ్నించింది. కాగా జనసేన తరఫున ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా వారంతా ఎన్నికల తర్వాత టీడీపీ, వైసీపీ వైపు వెళ్లిపోతారని అభిప్రాయపడ్డారు.

లైవ్ టీవి

Share it
Top