475మంది ఎంపీలు కోటీశ్వరులే: అందులో ఆ పార్టీయే టాప్..

475మంది ఎంపీలు కోటీశ్వరులే: అందులో ఆ పార్టీయే టాప్..
x
Highlights

చట్టసభలు ధనవంతుల సభలుగా మారుతున్నాయి. రాజకీయాల్లో ధన, కండ బలాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 88 శాతం మంది కోటీశ్వరులు...

చట్టసభలు ధనవంతుల సభలుగా మారుతున్నాయి. రాజకీయాల్లో ధన, కండ బలాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 88 శాతం మంది కోటీశ్వరులు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మొత్తం 542 మంది సభ్యుల్లో 475 మంది సంపన్నులు లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు. లోక్ సభ ధనవంతుల సభగా మారబోతుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 88 శాతం మంది కోటీశ్వరులు ఎంపీలుగా విజయం సాధించారు. 542 మంది సభ్యుల్లో 475 మంది కోటీశ్వరులున్నట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటికి రిఫామ్స్ సంస్థ వెల్లడించింది. 2009 లోక్ సభకు ఎన్నికలోన కోటీశ్వరుల శాతం 58 ఉండగా 2014లో 82 శాతం ఉన్నది.

పార్లమెంట్ లో అడుగుపెడుతున్న కోటీశ్వర్ల్లలో అత్యధికంగా బీజేపీ నుంచి గెలుపొందిన వారు ఉండగా తర్వాత స్థానల్లో కాంగ్రెస్, డీఎంకే, తృణముల్, వైసీపీ అభ్యర్ధులున్నారు. బీజేపీ నుంచి గెలిచిన 303 మందిలో 265 మంది కోటీశ్వరులు ఉన్నారు. వైసీపీ నుంచి 19 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, టీఆర్ఎస్ నుంచి గెలిచిన తొమ్మిది మంది కోటీశ్వరులే ఉన్నారు. మధ్యప్రదేశ్ చింధ్వారా నుంచి గెలుపొందిన సీఎం కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ ఆస్తుల ఆస్తుల విలువ 66 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం నుంచి గెలుపొందిన రఘురామకృష్ణం రాజు 325 కోట్లు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 305 కోట్లు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 221 కోట్ల ఆస్తులతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చివరి స్థానంలో 1.41 లక్షల ఆస్తులతో విశాఖ జిల్లా అరకు నుంచి ఎన్నికైన గొడ్డేటి మాధవి ఉన్నారు.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 43 కోట్ల వార్షిక ఆదాయం చూపించగా తర్వాత స్థానంలో చేవెళ్ల నుంచి గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డి 33 కోట్లు, కన్యాకుమారి నుంచి గెలుపొందిన వసంత కుమార్ 28 కోట్ల వ్యక్తిగత ఆదాయం ఉన్నట్లు లెక్కలు చూపించారు. ఆస్తులతో పాటు అత్యధిక అప్పులు కల్గి ఉన్న వారు కూడా పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. వీరిలో కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన వసంత కుమార్ కు 154 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇక ఏపీకి చెందిన వారిలో రఘురామకృష్ణరాజు 101 కోట్లు, వల్లభనేని బాలశౌరికి 74 కోట్లు అప్పులు ఉన్నాయి. ధనవంతులతో పాటు వివిధ కేసుల్లో నేరారోపణలు కల్గిన 29% వారు పార్లమెంట్ లోకి ప్రవేశించబోతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories