కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే... కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా ?

కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే... కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా ?
x
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసిన గూడూరు నారాయణరెడ్డికి...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసిన గూడూరు నారాయణరెడ్డికి మద్దతివ్వాలంటూ టీ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. అదే సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. గత కొన్నిరోజులుగా సండ్ర కారెక్కుతారనే ప్రచారం ఉండటంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఖమ్మం జిల్లాలో సాగులో ఉన్న 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు సాగర్‌ ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ను కోరినట్లు సండ్ర తెలిపారు. దీనిపై కేసీఆర్‌ కూడా సీఎస్‌కు ఆదేశాలిచ్చారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని జిల్లా అభివృద్ధి కోసమే కేసీఆర్‌ను కలిసినట్లు సండ్ర తెలిపారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కేసీఆర్‌ను కలవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆశలు గల్లంతైనట్టే అని రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగాసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories