పార్లమెంటు ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ కసరత్తు

పార్లమెంటు ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ కసరత్తు
x
Highlights

పార్లమెంట్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటనలకు సిద్ధమవుతున్నారు....

పార్లమెంట్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తామంటోన్న టీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. 16 లోక్‌ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే 16 లోక్‌సభ స్థానాల్లో సర్వేలు చేయించి బలాబలాలు లోటుపాట్లపై ఓ అంచనాకి వచ్చిన గులాబీ బాస్‌ నేతలంతా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలంటూ ఆదేశించారు. దాంతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మార్చి ఫస్ట్ వీక్‌ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనకు సిద్ధమవుతున్నారు. మొదటిగా కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని ఎంచుకున్న కేటీఆర్‌ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories