Top
logo

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
X
Highlights

తెలంగాణ గ్రామ పంచాయతి ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికల నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు.

తెలంగాణ గ్రామ పంచాయతి ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికల నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. 21, 25, 30 తేదీల్లో జరగనున్న ఎన్నికలు బ్యాలెట్‌ పద్దతిలో జరుపుతామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న నాగిరెడ్డి తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

గ్రామంలో సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. తొలివిడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7 న ప్రారంభమై 21 తో ముగుస్తుంది. రెండో విడత జనవరి 11 న ప్రారంభమై 25 తో ముగియనుంది. అలాగే మూడో విడత జనవరి 16 న ప్రారంభమై 30 తో ముగుస్తుంది. తొలి విడతలో 4 వేల 480 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా రెండో విడతలో 4 వేల 137 పంచాయతీలకు మూడో విడతలో 4 వేల 115 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు.

ఎన్నికలు జనవరి 21, 25, 30 తేదీల్లో జరుపుతామని.. నాగిరెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. ఈసారి ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని వివరించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుందని.. అదే రోజు చేతులెత్తే పద్దతి ద్వారా ఉపసర్పంచ్‌ ఎన్నిక ఉంటుందని తెలిపారు. తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని నాగిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 12 వేల 732 గ్రామ పంచాయతీలుండగా.. లక్ష 13 వేల 170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. ఇందుకోసం మొత్తం లక్ష 13 వేల 190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. లక్షా 50 వేల మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని నాగిరెడ్డి తెలిపారు.

మరోవైపు పంచాయతి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్దినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని.. ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేయాలని పిటీషన్‌లో కృష్ణయ్య కోరారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం 12 వందల మంది బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. అయితే పదవీకాలం పూర్తికాని 19 పంచాయతీలకు తోడుగా.. కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న మరో రెండు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని నాగిరెడ్డి తెలిపారు.

Next Story