Top
logo

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం: కుంతియా

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం: కుంతియా
Highlights

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగగా,...

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగగా, ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొత్తంగా 70 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత కుంతియా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా 10 ఎంపీ స్థానాలు గెలుస్తామని కుంతియా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గడం ఈసీ వైఫల్యమే కారణమన్నారు. కాగా పోలింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు సమకూర్చలేదని ఆరోపించారు. నిజామాబాద్‌లోఅవకాశం ఉన్నా బ్యాలెట్ నిర్వహించలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ఈసీ సహకరించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా నిజామాబాద్‌లో 6 గంటల వరకు కొనసాగింది.

Next Story