ఆ నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

ఆ నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌‌లో విలీనం కావడంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. మండలిలో కాంగ్రెస్‌ విలీనాన్ని రద్దు చేయాలంటూ ఇద్దరు...

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌‌లో విలీనం కావడంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. మండలిలో కాంగ్రెస్‌ విలీనాన్ని రద్దు చేయాలంటూ ఇద్దరు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో విలీనాన్ని ఆమోదిస్తూ రిలీజ్ చేసిన బులెటిన్ నెంబర్‌-9ను రద్దు చేయాలని కోరారు. పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మండలి ఛైర్మన్‌, అసెంబ్లీ లా సెక్రటరీ, సీఎస్‌తోపాటు ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, సంతోష్‌కుమార్ నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని గతంలో కాంగ్రెస్‌కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి అప్పటి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు లేఖ ఇవ్వగా దాన్ని ఆమోదించారు. విలీనాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories