Top
logo

రేపు ఢిల్లీ చంద్రబాబు పయనం.. ఎందుకంటే..

రేపు ఢిల్లీ చంద్రబాబు పయనం.. ఎందుకంటే..
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈసీని...

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈసీని కలిసి నిలదీయనున్నారు. ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ఈవీఎంల మొరాయింపు, అధికారుల బదిలీలు, ఇతర అంశాలపై సీరియస్‌గా చర్చించనున్నారు. అవసరమైతే ధర్నాకు కూడా దిగుతానని చంద్రబాబు చెబుతున్నారు. ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని మండిపడ్డారు. నేరస్తులు చెబితే ఈసీ పాటిస్తోందన్నారు. ఈవీఎంలు పనిచేయకపోతే మూడుసార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టంచేశారు. సీఈవోనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవాచేశారు. సీఈవోనే ఓటేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన నియంత మోదీ, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్ నేర చరిత్ర ఉన్న జగన్ కలిసి టార్గెట్‌ చేసిన ఎన్నికలుగా అభివర్ణించారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు చేశారన్నారు. ఎన్నికల్లో మహిళలంతా తనకు అండగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు. ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Next Story

లైవ్ టీవి


Share it