Top
logo

కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్‌

కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్‌
X
Highlights

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎవరు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో...

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎవరు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో ఎవరికి తెలియడం లేదు. ఇక అధికార పార్టీ టీడీపీని వీడుతున్న వారీ సంఖ్య క్రమంగా పెరుగుతోందనే చెప్పవచ్చు. ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్ఠం పుచ్చకున్న విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీలో రోజు రోజుకు విభేదాలు పెరుగుతున్నా వేళ తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ చెర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామా వెనకు ఉన్న కారణాలను కూడా వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో పెర్కోన్నారు. ఇష్టపూర్వకంగా రాజీనామా సమర్పిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఇది ఇలా ఉంటే చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ గూటికి చేరతారని వార్తాలు వస్తున్నాయి.

Next Story