విశాఖలో విద్యుత్‌కి భారీ డిమాండ్

విశాఖలో విద్యుత్‌కి భారీ డిమాండ్
x
Highlights

రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇంట్లో ఉక్కపోత, తలుపులు తీస్తే వడగాలి, మరోపక్క భరించలేని వేడి....

రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇంట్లో ఉక్కపోత, తలుపులు తీస్తే వడగాలి, మరోపక్క భరించలేని వేడి. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జులను లేకుండా ఉండలేక పోతున్నారు ప్రజలు. దీంతో విశాఖలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. విశాఖలో సగటున రోజుకు 19 నుంచి 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతుంది. దీనిని మెగావాట్లలో లెక్కిస్తే 960 వరకు విద్యుత్ అవసరం ఉంటుంది. అయితే గత నెలాఖరు నుంచి ఈ రీడింగ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటు విద్యుత్ వినియోగం 24 నుంచి 25 మిలియన్ యూనిట్ల వరకూ ఉంటోంది. దీంతో ఏపీలో అత్యధికంగా విద్యుత్ వినియోగిస్తున్న నగరంగా విశాఖ కొత్త రికార్డును సృష్టించింది.

విశాఖలో పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు, భారీ పరిశ్రమలు ఉండటంతో విద్యుత్ వినియోగంలో ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది.. రాష్ట్రం మొత్తం 7వేల300 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తుంటే అందులో కేవలం విశాఖ 1100 మెగావాట్ల విద్యుత్ విశాఖ వాసులే వాడేస్తున్నారు. వేసవి వేడిని తట్టుకోలేక మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏసీలు, ఫ్రిడ్జుల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం అవిలేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక గతంలో మాదిరిగా పవర్ కట్‌లు కూడా ప్రస్తుతం లేవని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి వేడికి తాళలేక ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం పెరిగాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల్లో భాగమయ్యాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది.


Show Full Article
Print Article
Next Story
More Stories