దంచికొడుతున్న ఎండలు.. బీర్ల అమ్మకాల జోరు..

దంచికొడుతున్న ఎండలు.. బీర్ల అమ్మకాల జోరు..
x
Highlights

భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. 9గంటల నుంచే వేడిగాలులు మొదలుకావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే మరీనూ.. ఏకంగా...

భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. 9గంటల నుంచే వేడిగాలులు మొదలుకావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే మరీనూ.. ఏకంగా నిప్పుల వర్షం కురుస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే చాలా మంది వేడిని తట్టుకోలేక రకరకాల ఆహార పదార్ధాలు, పండ్ల, చెరుకు రసాలు, కొబ్బరిబొండాలు, శీతల పానియాలు తీసుకుంటున్నారు. అదే మందు అలావాటు ఉన్నావారైతే..? దీంతో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మందుబాబులు బీరును ఆశ్రయిస్తున్నారు. అందుకే బీర్ల అమ్మకాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మందుబాబులకు బ్రాందీ, విస్కీ అలావాటు ఉన్నా రాష్ట్రంలో ఎండవేడితో మందుబాబులు రూటు మార్చారు. బ్రాందీ, విక్కీ వద్దు బీరే ముద్దంటున్నారు. దీంతో ఒక్క సారిగా బీరు అమ్మకాలు పెరిగి.. విస్కీ అమ్మకాలు పడిపోయాయి.

విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌లో బీరు సీసాల లెక్కలు చూసుకున్నట్లేయితే 2,54,729 కేసుల బీరు బాటిళ్లు అమ్ముడు పోయాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే 3,91,005 బాటిళ్ల బీరును తాగేశారట. అంటే పోయిన ఏడాదితో పొల్చుకుంటే దాదాపు 53.50 శాతం అమ్మకాలు రెట్టింపు అయినయన్నమాట. ఇక ఏకధాటిగా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతుండడంతో మే నెలలో మరింత అమ్మకాల జోరు పెరగవచ్చని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. భానుడి ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి మందుబాబులు బీర్లపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఎండలు ఉష్ణతాపంతో పాటే బీర్ల విక్రయాలూ రోజురోజుకూ జోరుగా ఊపందుకున్నాయన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories