ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర!

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర!
x
Highlights

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కీలక అధికారుల నియామకం వేగంగా సాగుతోంది. ఇప్పటికే డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారు కాగా...

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కీలక అధికారుల నియామకం వేగంగా సాగుతోంది. ఇప్పటికే డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారు కాగా రాష్ట్రంలో భద్రతాపరంగా కీలకమైన ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయన్న దానిపై కూడా దాదాపు క్లారిటీ వచ్చింది. ఏపీ కేడర్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర పేరు ఖరారయినట్టు తెలుస్తోంది.

స్టీఫెన్ రవీంద్ర. తెలుగు రాష్ట్రాల్లో హానెస్ట్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో మొదటగా వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, 2004లో ఆడిషనల్ ఎస్పీగా అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పని చేశారు. తర్వాత, వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మెుపారు. వరంగల్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీగా బలిదీ అయిన తర్వాత అక్కడి ఫ్యాక్షన్ ను కంట్రోల్ చేసి మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ఆంద్ర ప్రదేశ్ సెక్యురిటి గ్రూప్ ఎస్పీగా భాద్యతలు నిర్వహించారు. 2009లో కరీంనగర్ ఎస్పీగా భాద్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ డీసీపీగా భాద్యతలు చేపట్టారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఓయూలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కట్టడి చేయగలిగారు.

2010లో హైదరాబాద్ లోనే వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ నుంచి 2012లో నేరుగా గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా భాద్యతలు చేపట్టారు. 2016లో డీఐజీగా పదోన్నతి రావడంతో సైబరాబాద్ జాయింట్ సీపీగా భాధ్యతలు చేపట్టారు. ఇక 2017లో ఐజీగా పదోన్నతి పొందడంతో హైదరాబాద్ రేంజ్ ఐజీగా భాధ్యతలు నిర్వయిస్తూ 3 నెలలు క్రితం సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా సమర్ధుడైన అధికారిని నియమించాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories