Top
logo

వివేకా హత్య కేసులో అనుచరులపై బిగుస్తున్న ఉచ్చు

వివేకా హత్య కేసులో అనుచరులపై బిగుస్తున్న ఉచ్చు
X
Highlights

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా మర్డర్‌ కేసులో దర్యాప్తు కొలిక్కి వస్తోంది. వివేకా హత్యకు...

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా మర్డర్‌ కేసులో దర్యాప్తు కొలిక్కి వస్తోంది. వివేకా హత్యకు వారం రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అంచనాకి వచ్చారు. ముఖ్యంగా గంగిరెడ్డి, పరమేశ్వర్‌‌రెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. నాలుగు రోజులుగా గంగిరెడ్డిని విచారిస్తోన్న పోలీసులు అతనిచ్చిన సమాచారం మేరకు నిన్న తిరుపతిలో పరమేశ్వర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాజాగా నలుగురు పరమేశ్వర్‌‌రెడ్డి అనుచరులతోపాటు రౌడీషీటర్ దిద్దేకుంట శేఖర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వివేకా హత్యలో శేఖర్‌‌రెడ్డి ప్రమేయముందని అనుమానిస్తున్నారు. అంతేకాదు పరమేశ్వర్‌రెడ్డికి, శేఖర్‌‌రెడ్డికి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.వివేకా హత్యకు ముందు పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు.

Next Story