నన్నే సస్పెండ్‌ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే

నన్నే సస్పెండ్‌ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మద్య మాటల యుద్ధం మొదలయ్యింది. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణకు కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. సర్వేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మద్య మాటల యుద్ధం మొదలయ్యింది. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణకు కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. సర్వేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై సర్వే సత్యనారాయణ స్పందిస్తూ తాను ఏఐసీసీ సభ్యుడినని, నన్ను సస్పెండ్ చేసే అధికారం ఇక్కడి పీసీసీలో ఏ ఒక్కరికి లేదని తీవ్రస్థాయిలో సర్వే మండిపడ్డారు. తాను యూపీఏ హయాంలో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా సర్వే సత్యనారాయణ పనిచేశానని సోసియామ్మకు విధేయుడినని సర్వే చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కుంతియా వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని అన్నారు. పార్టీలో కొందరు కావాలనే తనపైకి రౌడీ ముకలను ఎగదోషారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుంతియాలు టికెట్లు అమ్ముకొని, తెరాస పార్టీకి కోవర్టులుగా పనిచేశారని సర్వే ఆరోపించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నాయని మరో రెండ్రోజుల్లో ఆధారలతో అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తానని అన్నారు. నన్ను సస్పెండ్ చేసినవారిని విడిచిపెట్టేదే లేదు తప్పకుండా వారి భరతం పడతానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories