Top
logo

కేసీఆర్‌ ఎప్పటికీ గెలుస్తూనే ఉంటారా..? -రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ ఎప్పటికీ గెలుస్తూనే ఉంటారా..? -రేవంత్‌రెడ్డి
X
Highlights

మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి డ్యాన్సులు చేశారు తప్ప సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించారా అని...

మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి డ్యాన్సులు చేశారు తప్ప సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించారా అని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని ఎందరో పెద్దవాళ్లంతా ఓటమిని చూశారని రేవంత్‌ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఎప్పటికీ గెలుస్తారా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, తాను సైనికాధిపతిగా ముందుండి నడిపిస్తానన్నారు. ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా చేస్తున్నప్పుడు ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.

Next Story