ఏపీలో మరోసారి 'రీ పోలింగ్‌'

ఏపీలో మరోసారి రీ పోలింగ్‌
x
Highlights

ఏపీలో మరో ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో ఈ నెల 19 న...

ఏపీలో మరో ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో ఈ నెల 19 న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై స్పందించిన సీఈసీ.. రీ పోలింగ్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీలో మరోసారి రీ పోలింగ్‌ జరగనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆయా కేంద్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుపుతారు.

గత నెల 11 న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా ఈ నెల 6 న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 5 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించారు. అలాగే ఈ నెల 10, 11 తేదీల్లో చంద్రగిరి నియోజవకర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది.

తన నియోజకవర్గంలో ఓ వర్గానికి చెందినవారి ఓట్లు వేయనీయకుండా అడ్డుకున్నారంటూ చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు అందడంతో అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈసీఐకి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ఈసీఐ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అనుమతిచ్చింది.

ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ ఆరోపించారు. అడిషనల్‌ సీఈవోను కలిసి కళా వెంకట్రావ్‌ రాష్ట్రంలో 49 పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఆయా కేంద్రాల్లో రీ పోలింగ్‌ జరపాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రెండు కేంద్రాలపై టీడీపీ అభ్యర్థి నాని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పోలింగ్‌ జరిగిన 24 రోజులకు వైసీపీ అభ్యర్థి ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశించారని అన్నారు. ఈసీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని ఈ సందర్భంగా కళా వెంకట్రావ్‌ వ్యాఖ్యానించారు. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని.. అదే ప్రతిపక్ష వైసీపీ కంప్లైంట్ చేస్తే ఈసీ నుంచి వెంటనే రియాక్షన్‌ వస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories