స్వరూపానంద, కేసీఆర్ భేటీలో రాజకీయాలపై చర్చ!

స్వరూపానంద, కేసీఆర్ భేటీలో రాజకీయాలపై చర్చ!
x
Highlights

విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజశ్యామల మాత విగ్రహా ప్రతిష్టాపనకు విశాఖ వెళ్లనందుకే హైదారాబాద్ వచ్చిన...

విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజశ్యామల మాత విగ్రహా ప్రతిష్టాపనకు విశాఖ వెళ్లనందుకే హైదారాబాద్ వచ్చిన స్వరూపానందను కలిసి ఆశీస్సులు తీసుకున్నారా..? రాజకీయ పరమైన అంశాలపై చర్చించారా.? ఇరువురి మధ్య ఏకాంత భేటీపై టీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది.

హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో విశాఖ స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా స్వామీజితో ఇరవై నిమిషాల పాటు ఏకాంత చర్చించారు కేసీఆర్. పార్టీ ఆవిర్బావ దినోత్సవం రోజునే స్వామి స్వరూపానందను కేసీఆర్ కలువడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ నెలలో శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారమహోత్సవానికి రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు స్వరుపానందస్వామి. జూన్ 15 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాని కోరారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలోనే రాజశ్యామల యాగం నిర్వహించారు. విశాఖలో రాజశ్యామల మాతా విగ్రహానికి హాజరు కాలేకపోయిన కేసీఆర్. ఎన్నికల తర్వాత విశాఖకు వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించారు.

హైదరాబాద్ వచ్చిన స్వరూపానంద స్వామిజీని కలిసిన నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన చర్చల్లో ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసన తర్వాత పార్టీకీ ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలపై స్వామీజీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ యాత్ర సందర్భంలోనూ కేసీఆర్ విశాఖలో స్వరూపానందను కలిసి ఆశీస్సులు పొందిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణంలో వివిధ రాష్ర్టాల పర్యటనకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్ స్వరూపానందతో చర్చలు జరపడం రాజకీయవర్గాల్లో ఆసక్తి కల్గిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories