Top
logo

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్
X
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌ భాస్కర్‌...

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వికెట్‌ పడింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పంపారు. పార్టీకి ఎంత నిబద్ధతతో పని చేసినా, తన పట్ల నిర్లక్ష‍్య వైఖరితో వ్యవహరిస్తున్నారని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నరన్న రాపోలు ఆంనంద భాస్కర్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న తనను కావాలనే పక్కన పెడుతున్నారని ఆరోపించారు. పైగా రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదని అన్నారు. కాగా ఇప్పటికే పలువురు నేతలు టీ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాపోలు కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీపై ప్రభావం పడనుంది.

Next Story