భట్టీ దీక్ష భగ్నం... నిమ్స్ ఆస్పత్రికి తరలింపు

భట్టీ దీక్ష భగ్నం... నిమ్స్ ఆస్పత్రికి తరలింపు
x
Highlights

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. భట్టిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి...

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. భట్టిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందిరాపార్క్ దగ్గర పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. భట్టి ఆరోగ్యం క్షీణించడంతో దీక్షా శిబిరం నుంచి నేరుగా నిమ్స్ కు తరలించారు.

పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులనును వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో భట్టి విక్రమార్క రెండు రోజుల క్రితం దీక్షకు దిగారు. ముందుగా 36 గంటల పాటు దీక్ష చేయాలని భావించారు. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా భట్టి చేపట్టిన దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు. భట్టి ఆమరణ దీక్షతో రాష్ర్ట స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని భట్టి దీక్షకు సంఘీ భావం తెలుపాలంటూ తెలంగాణ పీసీసీ నేతలు ఆహ్వానించారు. ఇవాళ రాహుల్ తోపాటు పలువురు ఏఐసీసీ నేతలు వచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో భట్టి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయినప్పటికీ ఆందోళన విరమించేది లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories