గిన్నిస్ రికార్డు సాధించేందుకు పోలవరం ప్రాజెక్టు సిద్ధం

గిన్నిస్ రికార్డు సాధించేందుకు పోలవరం ప్రాజెక్టు సిద్ధం
x
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టానికి తెరలేచింది. మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. గిన్ని‌స్ బుక్‌ రికార్డు లక్ష్యంగా భారీ ఎత్తున కాంక్రీట్‌ పనులు ప్రారంభమయ్యాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టానికి తెరలేచింది. మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. గిన్ని‌స్ బుక్‌ రికార్డు లక్ష్యంగా భారీ ఎత్తున కాంక్రీట్‌ పనులు ప్రారంభమయ్యాయి. 24 గంటల్లో 30వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. 2017లో దుబాయ్‌లో ఒక టవర్‌ నిర్మాణానికి 36గంటల్లో 21 వేల 580 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేయడం ప్రచంచ రికార్డుగా నమోదైంది. ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు పోలవరం కాంక్రీట్ పనులు శరవేగంతో చేస్తున్నారు. పోలవరం దగ్గర అసాధారణ రీతిలో సాగుతున్న కాంక్రీట్ పనుల రికార్డును నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు అక్కడే మకాం వేశారు.

పోలవరం స్పిల్ ఛానెల్ దగ్గర 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు రేపు ఉదయం 8 గంటల వరకు జరుగుతాయి. గంట గంటకు పనుల పురోగతిని గిన్నిస్ ప్రతినిధులు లండన్‌ లోని తమ కార్యాలయానికి అందిస్తారు. అయితే పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూడు నెలల క్రితం 24 గంటల్లో 11 వేల 158 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేశారు. మళ్లీ గత నెలలో 11 వేల 289 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసి ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసేందుకు పోలవరం కాంట్రాక్టు సంస్థ నవయుగ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలలోపు 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేస్తే ప్రపంచ రికార్డును సృష్టించినట్లవుతుంది.

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర గంటకు 3 వేల 770 మెట్రిక్‌ టన్నుల కంకర తయారు చేసే క్రషర్లున్నాయి. సిమెంటు, ఇసుక, ఇతర రసాయన మిశ్రమాలు కలిపే బ్లాచింగ్‌ ప్లాంట్లలో గంటకు 1560ఘనపు మీటర్ల కాంక్రీట్‌ కలుపుతున్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సిబ్బంది అనుమతి ఇచ్చిన వెంటనే ఇవాళ ఉదయం 8 గంటలకు స్పిల్‌ ఛానల్‌లో కాంక్రీట్‌ వేసే పనిని ప్రారంభించించారు. రేపు ఉదయం 8గంటల వరకు 30వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేసి రికార్డు సాధించాలనుకుంటున్నారు. రికార్డు పూర్తయిన తర్వాత కూడా కాంక్రీట్ పనిని మరికొన్ని గంటలపాటు కొనసాగించే ఆలోచనతో కూడా నగయుగ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు నమోదయితే రేపు పోలవరం ప్రాజెక్టు దగ్గర సీఎం చంద్రబాబు సమక్షంలో సంబరాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories