అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇదీ ప్రొఫైల్

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇదీ ప్రొఫైల్
x
Highlights

పోచారం శ్రీనివాసరెడ్డి కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. గ్రామస్థాయి నుంచి మంత్రిగా పని చేసే వరకు ఎదిగారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం టీఆర్ఎస్ లో చేరి అనేక పదవులు చేపట్టారు.

పోచారం శ్రీనివాసరెడ్డి కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. గ్రామస్థాయి నుంచి మంత్రిగా పని చేసే వరకు ఎదిగారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం టీఆర్ఎస్ లో చేరి అనేక పదవులు చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గా పని చేసే అవకాశం దక్కించుకున్నారు పోచారం. పోచారం శ్రీనివాసరెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. పరిగె పాపమ్మ రాజిరెడ్డి దంపతులకు 1949 ఫిబ్రవరి 10న ఆయన జన్మించారు. 1976లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1977లో దేశాయ్‌పేట్ పీఏసీఎస్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. 1980లో బాన్సువాడ సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1981 ఎల్.ఎం.బి డైరెక్టర్ పని చేశారు పోచారం.

పోచారం శ్రీనివాసరెడ్డి 1984లో టీడీపీ చేరారు. 1985లో బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ పని చేశారు. 1987 లో బుదిమి కో-ఆపరేటీవ్ బ్యాంకు ప్రెసిడెంట్ గా , నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా పని చేశారు. 1989లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1988లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, 1991 లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పోచారం పని చేశారు. 1993 లో తిరిగి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన 1994 బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. 1999లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు పొంది భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నారు.

2000 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో బాన్స్‌వాడ శాసన సభ్యునిగా ఓటమి పాలైన పోచారం 2005లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2009లో తిరిగి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2011 లో తిరిగి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నారు. 2014లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories