Top
logo

టీడీపీ లేనే లేదు.. జగన్ తోనే పోటీ!: పవన్ సంచలన వ్యాఖ్య..

టీడీపీ లేనే లేదు.. జగన్ తోనే పోటీ!: పవన్ సంచలన వ్యాఖ్య..
X
Highlights

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతొంది. ఏపీలో ప్రధానంగా త్రిముఖ పోటీ నడుస్తున్నదనే చెప్పవచ్చు. అధికార పార్టీ...

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతొంది. ఏపీలో ప్రధానంగా త్రిముఖ పోటీ నడుస్తున్నదనే చెప్పవచ్చు. అధికార పార్టీ టీడీపీ, వైసీపీ, జనసేన. కాగా తాజాగా పవన్ ఏపీ ప్రధాన పార్టీలపై ప్రస్తవించారు. టీడీపీకీ జనసేనకు మధ్యవర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని వస్తున్న విమర్శలపై స్పందిన పవన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తెలుగుదేశం పార్టీ అన్నదే లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో జనసేన జెండా రేపరేపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు జనసేనాని.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖా ముఖా జరిగింది. ఇందులో పవన్ పలు అంశాలకు సమాధానాలు చెప్పారు. ఏపీలో మిగత పార్టీలు ఎలా ఉన్నా తాను పోటీ పడుతున్నది వైసీపీతోనేనని తనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థి అంటూ పవన్ స్పష్టం చేశారు. గత2018 నుంచే టీడీపీ లేదన్న ఆయన కేసీఆర్ టీడీపీ సైకిల్ చైన్‌ను తెంపేశారన్నారు. ఒకవైపు పవన్ ను టీడీపీ గూలాందారుడని చెప్పుకొస్తున్న వేళ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పవన్ చేసిన వ్యాఖ్య అనుకోకుండా చేసిందా? లేక ఏదైనా లోతైన ఆలోచనతో చేసిందా? అని తెలుగు తమ్ముళ్లలో అంతులేని కన్ఫ్యూజన్ కు పవన్ గురి చేశారని చెప్పక తప్పదు.

Next Story