Top
logo

కుల, మత ప్రస్తావన లేని పవన్‌ నామపత్రం

కుల, మత ప్రస్తావన లేని పవన్‌ నామపత్రం
Highlights

ఆస్తులు 52 కోట్లు, అప్పులు 30 కోట్లు. పిల్లల పేరు మీద దాదాపు మూడు కోట్ల ఆస్తులు, భార్య పేరు మీద 30 లక్షల...

ఆస్తులు 52 కోట్లు, అప్పులు 30 కోట్లు. పిల్లల పేరు మీద దాదాపు మూడు కోట్ల ఆస్తులు, భార్య పేరు మీద 30 లక్షల ఆస్తులు, కులం పేరు ఎత్తలేదు, మతం మాటే లేదు.. ఇదేదో సాదా సీదా నాయకుడి గురించో దారిన పోయే దానయ్య గురించో కాదు వెండితెరని ఏలిన కథానాయకుడు ఒక పార్టీ అథినేత ఎన్నికల అఫిడవిట్ ఇంతకీ ఎవరు అతను?

ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్ అందులో అతని ఆస్తులు, అప్పులు ఇతర వివరాలను వెల్లడించారు. పవన్‌కు 52 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు12కోట్లు కాగా స్థిరాస్తులు 40 కోట్ల 81లక్షలని తెలిపారు. భార్య అన్నాలెజినోవా పేరుమీద 30.50 లక్షల చరాస్తులు, శంకరపల్లి మండలంలో జన్‌వాడ గ్రామంలో మూడు ప్రాంతాల్లో 18 ఎకరాల పొలం, ఆరుచోట్ల వ్యవసాయేతర స్థలాలు, నివాస భవం ఉన్నాయని పవన్ ప్రకటించారు. పిల్లల పేర్ల మీద 2 కోట్ల92 కోట్లు ఆస్తులున్నట్టు వివరించారు.

ఇక పవన్ సమర్పించిన అఫిడవిట్ లో 33 కోట్ల 72లక్షల రుణం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అందులో HDFC బ్యాంకు నుంచి 9కోట్ల82 లక్షల రుణం, ఇండస్‌ఇండ్ బ్యాంకు నుంచి 68.63 లక్షల రుణం, HDFC బ్యాంకు OD నుంచి 2కోట్ల 10 లక్షల రుణం, దర్శకుడు ఎ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి 2కోట్ల 40 లక్షలు, హారిక, హాసిని సంస్థ నుంచి 1 కోటి 25 లక్షలు, వదిన సురేఖ 1 కోటి 07 లక్షలు, ప్రవీణ్ కుమార్ నుంచి 3 కోట్లు, MVRS ప్రసాద్ నుంచి 2 కోట్లు, బాలాజీ సినీ మీడియా నుంచి 2 కోట్లు, వెంకటేశ్వరా సినీచిత్ర నుంచి 27.55 లక్షలు, నవీన్ కుమార్ నుంచి 5 కోట్ల 50 లక్షలు, ఇతర చెల్లింపులు 3 కోట్ల 60 లక్షలు.. మొత్తం 33 కోట్ల 72 లక్షలు చెల్లించాలని పవన్ పేర్కొన్నారు. ప్రజా నాయకులు కులమతాలకు అతీతంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ తన నామినేషన్‌లో కుల మతాలు ప్రస్తావించలేదు. ఇదే తరహాలో జనసేన అభ్యర్థులు కూడా నామినేషన్లు సమర్పించాలని పవన్ కోరారు.


లైవ్ టీవి


Share it
Top