సోనియాతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి భేటీ

సోనియాతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి భేటీ
x
Highlights

పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీని కలిశారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు...

పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీని కలిశారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలపై గాను సోనియాగాంధీని కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి మధ్య సమావేశం కొనసాగింది. అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో డీఎంకే నాయకుడు టీ.ఆర్.బాలును ప్రహ్లాద్ జోషి కలిసి సమావేశాలపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాలు వచ్చెనెల( జులై 26) వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 5న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories