నెమలిని పెంచుకున్న వ్యక్తిపై కేసు నమోదు

నెమలిని పెంచుకున్న వ్యక్తిపై కేసు నమోదు
x
Highlights

కొంత మంది వ్యక్తులు పక్షులను, జంతువులను సరదాగా పెంచుకుంటారు. ఇదే విధంగా ఆఅదిలాదాద్ జిల్లాలో ఒక వ్యక్తి సరదాకి పెంచుకున్న పెంపుడు పక్షి వలన కేసులో ఇరుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది.

కొంత మంది వ్యక్తులు పక్షులను, జంతువులను సరదాగా పెంచుకుంటారు. ఇదే విధంగా ఆఅదిలాదాద్ జిల్లాలో ఒక వ్యక్తి సరదాకి పెంచుకున్న పెంపుడు పక్షి వలన కేసులో ఇరుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. మన జాతీయ పక్షి నెమలిని ఒక వ్యక్తి సరదాగ పెంచుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి నెమలిని నిబంధనలకు వ్యతిరేకంగా పెంచుకున్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆ అటవీ అధికారులు నెమలిని స్వాధీనం చేసుకుని, ఆ వ్యక్తిపై వన్యస్తాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసారు.

అసలు వివరాల్లోకెళితే పక్షులపై ఉన్న ప్రేమతో ఆదిలాబాద్‌ పట్టణం భుక్తాపూర్‌నివసించే సాజిద్‌ హుస్సేన్‌ కొంత కాలంగా తెల్ల నెమలిని పెంచుకుంటున్నారు. ఇతను ఈ నెమలిని మహారాష్ట్రలోని నాగపూర్‌ వెళ్ళే దారిలో కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌ అటవీ క్షేత్రాధికారి అప్పయ్య మంగళవారం ఉదయం ఉప క్షేత్రాధికారులు గులాబ్‌సింగ్‌, గీరయ్య, ఎఫ్‌బీఓలు అహ్మద్‌ఖాన్‌, ప్రశాంత్‌లు అతని ఇంట్లో సోదాలు నిర్వహించి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు సాజిద్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ తరువాత వన్య ఫ్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసామని క్షేశ్రాధికారి అప్పయ్య తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories