చంద్రబాబును విమర్శించడం తగదు..

చంద్రబాబును విమర్శించడం తగదు..
x
Highlights

ఇటివల వెలువడిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ సునామీ సృష్టించి సంచలన విజయం సాధించింది....

ఇటివల వెలువడిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ సునామీ సృష్టించి సంచలన విజయం సాధించింది. అసెంబ్లీ, లోక్‌సభ రెండింటిలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఫ్యాన్ జోరుకి అధికార టీడీపీ బేజారైంది. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై అన్ని పక్షాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చంద్రబాబుకి మద్దతుగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శిండం సరికాదన్నారు. ట్వీట్టర్ వేదికగా చంద్రబాబుగారు మన మాజీ ముఖ్యమంత్రి..ఇప్పుడు ఓటమిపాలైనంత మాత్రన నారా చంద్రబాబును ఇలా విమర్శించడం తప్పని, మనిషి అధికారంలో ఉండగా విమర్శిండం వేరు. ఓడిపోయాక విమర్శడం చేతకానితనం, ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలేయ్యాలి. అంతే కాని సందు దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం అని ట్వీట్టర్‌లో పొస్ట్ చేశారు.

అయితే నాగబాబు చేసిన ట్వీట్‌కి నెటిజన్లు ఓ రేంజ్‌లో తమదైన శైలీలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన ఒకటేనని ప్రజల్లోకి వెళ్లిందని ఇక దానికి నిదర్శనమే ఏపీలో వైసీపీ జయకేతనమే అని వ్యాఖ్యనించారు. అలాగే టీడీపీని వదిలేసి జనసేన భవిష్యత్తు కార్యక్రమాలపై దృష్టిపెడితే చాలా మంచిదని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories